Sri Lalitha Chalisa pdf download – శ్రీ లలితా చాలీసా

లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవంమా
శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం || 1 ||
హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప
చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం || 2 ||
పద్మరేకుల కాంతులలో బాలాత్రిపురసుందరిగా
హంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి || 3 ||
శ్వేతవస్త్రము ధరియించి అక్షరమాలను పట్టుకొని
భక్తిమార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి || 4 ||
నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ
ఆదిబిక్షువై వచ్చాడు సాక్షాదాపరమేశ్వరుడు || 5 ||
కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా
కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు || 6 ||
శ్రీచక్రరాజ నిలయినిగా శ్రీమత్ త్రిపురసుందరిగా
సిరి సంపదలు ఇవ్వంమా శ్రీమహాలక్ష్మిగా రావంమా || 7 ||
మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో
మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి || 8 ||
పసిడి వెన్నెల కాంతులలో పట్టువస్త్రపుధారణలో
పారిజాతపు మాలలలో పార్వతి దేవిగా వచ్చితివి || 9 ||
రక్తవస్త్రము ధరియించి రణరంగమున ప్రవేశించి
రక్తబీజుని హతమార్చి రంయకపర్దినివైనావు || 10 ||
కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి
కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలిసితివి || 11 ||
రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా
రమా వాణి సేవితగా రాజరాజేశ్వరివైనావు || 12 ||
ఖడ్గం శూలం ధరియించి పాశుపతాస్త్రము చేబూని
శుంభ నిశుంభుల దునుమాడి వచ్చింది శ్రీశ్యామలగా || 13 ||
మహామంత్రాధిదేవతగా లలితాత్రిపురసుందరిగా
దరిద్ర బాధలు తొలిగించి మహదానందము కలిగించే || 14 ||
అర్తత్రాణ పరాయణివే అద్వైతామృత వర్షిణివే
ఆదిశంకర పూజితవే అపర్ణాదేవి రావంమా || 15 ||
విష్ణు పాదమున జనియించి గంగావతారము ఎత్తితివి
భాగీరథుడు నిను కొలువ భూలోకానికి వచ్చితివి || 16 ||
ఆశుతోషుని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి
ఆదిప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబా || 17 ||
దక్షుని ఇంట జనియించి సతీదేవిగా చాలించి
అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబా || 18 ||
శంఖు చక్రము ధరియించి రాక్షస సంహారమును చేసి
లోకరక్షణ చేసావు భక్తుల మదిలో నిలిచావు || 19 ||
పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా
చిరునవ్వులను చిందిస్తూ చెఱుకు గడను ధరయించితివి || 20 ||
పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో
ప్రమథగణములు కొలువుండ కైలాసంబే పులకించే || 21 ||
సురులు అసురులు అందరును శిరసును వంచి ంరొక్కంగా
మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి || 22 ||
మూలాధార చక్రములో యోగినులకు ఆదీశ్వరియై
అంకుశాయుధ ధారిణిగా భాసిల్లెను శ్రీ జగదంబా || 23 ||
సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిణి రూపొంది
శంఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి || 24 ||
మహామేరువు నిలయినివి మందార కుసుమ మాలలతో
మునులందరు నిను కొలవంగ మోక్షమార్గము చూపితివి || 25 ||
చిదంబరేశ్వరి నీ లీల చిద్విలాసమే నీ సృష్టి
చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే || 26 ||
అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం
అద్భుతమైనది నీ మహిమ అతిసుందరము నీ రూపం || 27 ||
అంమలగన్న అంమవుగా ముగ్గురంమలకు మూలముగా
జ్ఞానప్రసూనా రావంమా జ్ఞానమునందరికివ్వంమా || 28 ||
నిష్ఠతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము
కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు || 29 ||
రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప
అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి || 30 ||
అరుణారుణపు కాంతులలో అగ్ని వర్ణపు జ్వాలలలో
అసురులనందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి || 31 ||
గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా
భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి || 32 ||
పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికీ మాతవుగా
అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి || 33 ||
కరుణించంమా లలితంమా కాపాడంమా దుర్గంమా
దర్శనమియ్యగ రావంమా భక్తుల కష్టం తీర్చంమా || 34 ||
ఏ విధముగా నిను కొలిచినను ఏ పేరున నిను పిలిచినను
మాతృహృదయవై దయచూపు కరుణామూర్తిగా కాపాడు || 35 ||
మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి
మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి || 36 ||
త్రిమాతృరూపా లలితంమా సృష్టి స్థితి లయకారిణివి
నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మా తరమవునా || 37 ||
ఆశ్రితులందరు రారండి అంమరూపము చూడండి
అంమకు నీరాజనమిచ్చి అంమ దీవెన పొందుదము || 38 ||
సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి
సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు || 39 ||
మంగళగౌరీ రూపమును మనసుల నిండా నింపండి
మహాదేవికి మనమంతా మంగళ హారతులిద్దాము || 40 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment