కాళీ కాళి మహాకాళి కాళికే పాపహారిణి |
ధర్మమోక్షప్రదే దేవి గుహ్యకాళి నమోఽస్తు తే || 1 ||
సంగ్రామే విజయం దేహి ధనం దేహి సదా గృహే |
ధర్మకామార్థసంపత్తిం దేహి కాళి నమోఽస్తు తే || 2 ||
ఉల్కాముఖి లలజ్జిహ్వే ఘోరరావే భగప్రియే |
శ్మశానవాసిని ప్రేతే శవమాంసప్రియేఽనఘే || 3 ||
అరణ్య చారిణి శివే కులద్రవ్యమయీశ్వరి |
ప్రసన్నాభవ దేవేశి భక్తస్య మమ కాళికే || 4 ||
శుభాని సంతు కౌలానాం నశ్యంతు ద్వేషకారకాః |
నిందాకరా క్షయం పాంతు యే చ హాస్య ప్రకుర్వతే || 5 ||
యే ద్విషంతి జుగుప్సంతే యే నిందంతి హసంతి యే |
యేఽసూయంతే చ శంకంతే మిథ్యేతి ప్రవదంతి యే || 6 ||
తే డాకినీముఖే యాంతు సదారసుతబాంధవాః |
పిబత్వం శోణితం తస్య చాముండా మాంసమత్తు చ || 7 ||
ఆస్థీనిచర్వయంత్వస్య యోగినీ భైరవీగణాః |
యానిందాగమతంత్రాదౌ యా శక్తిషు కులేషు యా || 8 ||
కులమార్గేషు యా నిందా సా నిందా తవ కాళికే |
త్వన్నిందాకారిణాం శాస్త్రీ త్వమేవ పరమేశ్వరి || 9 ||
న వేదం న తపో దానం నోపవాసాదికం వ్రతం |
చాంద్రాయణాది కృచ్ఛం చ న కించిన్మానయాంయహం || 10 ||
కింతు త్వచ్చరణాంభోజ సేవాం జానే శివాజ్ఞయా |
త్వదర్చా కుర్వతో దేవి నిందాపి సఫలా మమ || 11 ||
రాజ్యం తస్య ప్రతిష్ఠా చ లక్ష్మీస్తస్య సదా స్థిరా |
తస్య ప్రభుత్వం సామర్థ్యం యస్య త్వం మస్తకోపరి || 12 ||
ధన్యోఽహం కృతకృత్యోఽహం సఫలం జీవతం మమ |
యస్య త్వచ్చరణద్వందే మనో నివిశతే సదా || 13 ||
దైత్యాః వినాశమాయాంతు క్షయం యాంతు చ దానవాః |
నశ్యంతు ప్రేతకూష్మాండా రాక్షసా అసురాస్తథా || 14 ||
పిశాచ భూత వేతాళాం క్షేత్రపాలా వినాయకాః |
గుహ్యకాః ఘోణకాశ్చైవ విలీయంతా సహస్రధా || 15 ||
భారుండా జంభకాః స్కాందాః ప్రమథాః పితరస్తథా |
యోగిన్యో మాతరశ్చాపి డాకిన్యః పూతనాస్తథా || 16 ||
భస్మీభవంతు సపది త్వత్ ప్రసాదాత్ సురేశ్వరి |
దివాచరా రాత్రిచరా యే చ సంధ్యాచరా అపి || 17 ||
శాఖాచరా వనచరాః కందరాశైలచారిణః |
ద్వేష్టారో యే జలచరా గుహాబిలచరా అపి || 18 ||
స్మరణాదేవ తే సర్వే ఖండఖండా భవంతు తే |
సర్పా నాగా యాతుధానా దస్యుమాయావినస్తథా || 19 ||
హింసకా విద్విషో నిందాకరా యే కులదూషకాః |
మారణోచ్చాటనోన్మూల ద్వేష మోహనకారకాః || 20 ||
కృత్యాభిచారకర్తారః కౌలవిశ్వాసఘాతకాః |
త్వత్ప్రసాదాజ్జగద్ధాత్రి నిధనం యాంతు తేఽఖిలాః || 21 ||
నవగ్రహాః సతిథయో నక్షత్రాణి చ రాశయః |
సంక్రాంతయోఽబ్దా మాసాశ్చ ఋతవో ద్వే తథాయనే || 22 ||
కలాకాష్ఠాముహుర్తాశ్చ పక్షాహోరాత్రయస్తథా |
మన్వంతరాణి కల్పాశ్చ యుగాని యుగసంధయః || 23 ||
దేవలోకాః లోకపాలాః పితరో వహ్నయస్తథా |
అధ్వరా నిధయో వేదాః పురాణాగమసంహితా || 24 ||
ఏతే మయా కీర్తితా యే యే చాన్యే నానుకీర్తితాః |
ఆజ్ఞయా గుహ్యకాళ్యాస్తే మమ కుర్వంతు మంగళం || 25 ||
భవంతు సర్వదా సౌంయాః సర్వకాలం సుఖావహాః |
ఆరోగ్యం సర్వదా మేఽస్తు యుద్ధే చైవాపరాజయః || 26 ||
దుఃఖహానిః సదైవాస్తాం విఘ్ననాశః పదే పదే |
అకాలమృత్యు దారిద్ర్యం బంధనం నృపతేర్భయం || 27 ||
గుహ్యకాళ్యాః ప్రసాదేన న కదాపి భవేన్మమ |
సంత్వింద్రియాణి సుస్థాని శాంతిః కుశలమస్తు మే || 28 ||
వాంఛాప్తిర్మనసః సౌఖ్యం కల్యాణం సుప్రజాస్తథా |
బలం విత్తం యశః కాంతిర్వృద్ధిర్విద్యా మహోదయః || 29 ||
దీర్ఘాయురప్రధృష్యత్వం వీర్యం సామర్థ్యమేవ చ |
వినాశో ద్వేషకర్తౄణాం కౌలికానాం మహోన్నతిః |
జాయతాం శాంతిపాఠేన కులవర్త్మ ధృతాత్మనాం || 30 ||
Sri Kali Shanti Stotram pdf download – శ్రీ కాళీ శాంతి స్తోత్రం