Sri Durga Parameshwari Stotram by Sringeri Jagadguru pdf download – శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్రం

✅ Fact Checked
[** అధునా సర్వత్ర జగతి ప్రసరతః జనానం ప్రాణాపాయకరస్య కొరోనా నామకస్య రోగవిశేషస్య నివారణార్థం శృంగేరీ జగద్గురు విరచిత శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్ర పారాయణం కరిష్యే | **] ఏతావంతం సమయం
సర్వాపద్భ్యోఽపి రక్షణం కృత్వా |
దేశస్య పరమిదానీం
తాటస్థ్యం కేన వహసి దుర్గాంబ || 1 ||
అర్థం – ఇప్పటి వరకు దేశమును అన్ని ఆపదల నుంచి కాపాడావు. ఓ దుర్గాంబా, ఇప్పుడు నువ్వు ఏమీ పట్టించుకోనట్టుగా ఉన్నావు.
అపరాధా బహుశః ఖలు
పుత్రాణాం ప్రతిపదం భవంత్యేవ |
కో వా సహతే లోకే
సర్వాంస్తాన్మాతరం విహాయైకాం || 2 ||
అర్థం – పిల్లలు అడుగడుగునా చాలా తప్పటడుగులు వేస్తారు. ఈ లోకంలో వారిని కన్నతల్లి కాకుండా అవన్నీ ఇంకెవరు సహించగలరు?
మా భజ మా భజ దుర్గే
తాటస్థ్యం పుత్రకేషు దీనేషు |
కే వా గృహ్ణంతి సుతాన్
మాత్రా త్యక్తాన్వదాంబికే లోకే || 3 ||
అర్థం – అలాంటి కన్నతల్లులు కూడా వదిలేసిన దీనావస్థలో ఉన్న పిల్లలను, ఓ దుర్గంమా, నీవు కూడా పట్టించుకోకుండా ఉంటే ఇంకెవరు రక్షిస్తారు?
ఇతః పరం వా జగదంబ జాతు
దేశస్య రోగప్రముఖాపదోఽస్య |
న స్యుస్తథా కుర్వచలాం కృపాం
ఇత్యభ్యర్థనాం మే సఫలీకురుష్వ || 4 ||
అర్థం – కాబట్టి, ఓ జగదంబా (లోకాన్ని కన్నతల్లీ), ఈ రోగంతో దేశానికి వచ్చిన ముఖ్యమైన ఆపదను తొలగించు. నీ కరుణను స్థిరముగా చూపుము. నా ఈ అభ్యర్థనను (కోరిక) సఫలము చేయి.
పాపహీనజనతావనదక్షాః
సంతి నిర్జరవరా న కియంతః |
పాపపూర్ణజనరక్షణదక్షాం
త్వాం వినా భువి పరాం న విలోకే || 5 ||
అర్థం – ఏటువంటి పాపము లేకుండా, నశించిపోకుండా, జనులను రక్షించేవారు (దేవతలు) ఎవరైనా ఉన్నరా? ఓ దుర్గంమా, నువ్వు తప్ప పాపము చేసిన జనులను కూడా రక్షించగల సమర్థత ఉన్నవారు ఎవరూ కనిపించడం లేదు. కాబట్టి రక్షించు.
ఇతి శృంగేరీ జగద్గురు విరచితం శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్రం ||

Also Read  Mahadeva Kruta Durga Stotram pdf download – శ్రీ దుర్గా స్తోత్రం (మహాదేవ కృతం)

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment