శ్రీశాత్మభూముఖ్యసురార్చితాంఘ్రిం
శ్రీకంఠశర్వాదిపదాభిధేయం |
శ్రీశంకరాచార్యహృదబ్జవాసం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 1
చండాంశుశీతాంశుకృశానునేత్రం
చండీశముఖ్యప్రమథేడ్యపాదం |
షడాస్యనాగాస్యసుశోభిపార్శ్వం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 2
ద్రవ్యాదిసృష్టిస్థితినాశహేతుం
రవ్యాదితేజాంస్యపి భాసయంతం |
పవ్యాయుధాదిస్తుతవైభవం తం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 3
మౌలిస్ఫురజ్జహ్నుసుతాసితాంశుం
వ్యాలేశసంవేష్టితపాణిపాదం |
శూలాదినానాయుధశోభమానం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 4
లీలావినిర్ధూతకృతాంతదర్పం
శైలాత్మజాసంశ్రితవామభాగం |
శూలాగ్రనిర్భిన్నసురారిసంఘం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 5
శతైః శ్రుతీనాం పరిగీయమానం
యతైర్మునీంద్రైః పరిసేవ్యమానం |
నతైః సురేంద్రైరభిపూజ్యమానం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 6
మత్తేభకృత్యా పరిశోభితాంగం
చిత్తే యతీనాం సతతం వసంతం |
విత్తేశముఖ్యైః పరివేష్టితం తం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 7
హంసోత్తమైశ్చేతసి చింత్యమానం
సంసారపాథోనిధికర్ణధారం |
తం సామగానప్రియమష్టమూర్తిం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 8
నతాఘహం నిత్యచిదేకరూపం
సతాం గతిం సత్యసుఖస్వరూపం |
హతాంధకం హృద్యపరాక్రమం తం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 9
మాయాతిగం వీతభయం వినిద్రం
మోహాంతకం మృత్యుహరం మహేశం |
ఫాలానలం నీలగలం కృపాలుం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 10
మిత్రం హి యస్యాఖిలశేవధీశః
పుత్రశ్చ విఘ్నౌఘవిభేదదక్షః |
పాత్రం కృపాయాశ్చ సమస్తలోకః
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 11
ఇతి శ్రీ చంద్రమౌళీశ్వర వర్ణమాలా స్తోత్రం ||
Sri Chandramoulishwara Varnamala Stotram pdf download – శ్రీ చంద్రమౌళీశ్వర వర్ణమాలా స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



