1. షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.
2. అర్హులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించినంతనే సుఖసంపదలు పొందగలరు.
3. ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను.
4. నా భక్తులకు రక్షణంబు నా సమాధినుండియే వెలువడుచుండును.
5. నా సమాధినుండియే నా మనుష్య శరీరము మాట్లాడును.
6. నన్నాశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
7. నాయందెవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము.
8. మీ భారములను నాపై బడవేయుడు, నేను మోసెదను.
9. నా సహాయము గాని, నా సలహాను గాని కోరిన తక్షణమొసంగ సంసిద్ధుడను.
10. నా భక్తుల యింట లేమి యను శబ్దమే పొడచూపదు.
11. నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును.
Shirdi Sai Ekadasa Sutralu pdf download – శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



