పెద్ద సినిమాల మాయలో పడి దిల్ రాజు ఆ సినిమాని పట్టించుకోలేదా?

✅ Fact Checked

అగ్ర నిర్మాత దిల్ రాజు తన సినిమాలను ఏ స్థాయిలో ప్రమోట్ చేస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా రివ్యూలు, టాక్ తో సంబంధం లేకుండా సక్సెస్ మీట్, ప్రెస్ మీట్ అంటూ హడావిడి చేసి ఎలా అయినా సినిమాని జనంలోకి తీసుకెళ్తాడు. యావరేజ్ టాక్ ఉన్న సినిమాని కూడా తన ప్రమోషన్స్ తో గట్టెక్కించిన సందర్భాలున్నాయి. కానీ, మొదటిసారి రాజ్ తరుణ్ `ఇద్దరి లోకం ఒకటే` ప్రమోషన్స్ ని పూర్తిగా ఆపేసారు. చడీచప్పుడూ లేకుండా ఒక చిన్న ప్రీరిలీజ్ ఫంక్షన్ తో సరిపెట్టి రిలీజ్ చేసారు. సినిమా చూసిన మొదటిరోజే ప్రేక్షకులు కూడా పెదవి విరిచారు. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఇద్దరి లోకం ఒకటే సినిమా ఒక మోస్తరు ప్రమోషన్స్ చేసిన ఈజీగా లాభాల్లోకి వెళ్ళేది. కానీ, అసలు రిలీజ్ అయిన సంగతి కూడా చాలామంది ప్రేక్షకులకు తెలియనంతగా లైట్ తీస్కున్నారు. దిల్ రాజుకి ఈ సినిమా వల్ల నష్టమేమి లేదు. కొత్త వాళ్ళు తీస్తున్న సినిమాల కంటే తక్కువ బడ్జెట్ లో తీశారు, రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి అంటగట్టారు. రాజ్ తరుణ్ అంటే యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో పెద్దగా కష్టపడకుండా మొదటి రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి. కానీ, రెండో రోజునుంచి కలెక్షన్స్ నెమ్మదించాయి.

పెద్ద సినిమాల మాయలో పడి దిల్ రాజు ఆ సినిమాని పట్టించుకోలేదా?

దిల్ రాజు ఈ సినిమా రివ్యూలు చూసి ఎలాగూ ఆడదని వదిలేశారా లేక వేరే సినిమాల పనుల్లో బిజీగా ఉండి దీన్ని పట్టించుకోలేదా అని అందరు చర్చించుకుంటున్నారు. అసలు సినిమా రిలీజ్ కి ముందే దిల్ రాజు అనుమానం వ్యక్తం చేశారు. పంపిణీ వర్గాల్లో మాత్రం ప్రచారం చెయ్యలేదన్న ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కొత్తవాళ్ళ సినిమాలు కూడా 3-4 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతున్నాయి. రాజ్ తరుణ్ లాంటి పేరున్న నటుడిని, దిల్ రాజు లాంటి టాప్ ప్రొడ్యూసర్ ఉండి కూడా కోటి రూపాయల కలెక్షన్స్ తెచ్చుకోలేకపోయిందంటే అది ఖచ్చితంగా ప్రచారలోపమే అనే వాళ్ళు కూడా ఉన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, పంపిణీదారులు చిన్న సినిమాల విషయంలో జాగ్రత్త పడే అవకాశం ఉంది.

ఇంకా పెద్ద అనుమానం ఏంటంటే అసలు ఈ సినిమా వేరెవరో నిర్మించి తక్కువ రేట్ కి దిల్ రాజుకి ఇచ్చేశారని, ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేసి లాభాల్లో చెరిసగం తీసుకున్నారని టాక్. అసలు శ్రీవెంకటేశ్వర బ్యానర్ లో ఉండాల్సిన ప్రమాణాలు కూడా లోపించాయి. ఇంత అవుట్ డేటెడ్ కథని దిల్ రాజు ఓకే చేసే ప్రశక్తే లేదని చెప్పుకుంటున్నారు. ఈ సంక్రాంతికి రాబోతున్న పెద్ద సినిమాలన్నీ నైజాంలో దిల్ రాజు ఒక్కడే పంపిణీ చేస్తున్నాడు. ఆ పనుల్లో తలమునకలై ఉన్న దిల్ రాజుకి ఈ సినిమాని పట్టించుకునేంత తీరిక లేదు. మొత్తానికి భారీ చిత్రాల ప్రమోషన్ హడావుడిలో పడి రాజ్ తరుణ్ కెరీర్ కి దిల్ రాజు శుభం కార్డు వేసాడని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఇంతకుముందు 5-10 కోట్లలో ఉన్న రాజ్ తరుణ్ మార్కెట్ ఇప్పుడు 3 కోట్ల లోపుకి కుచించుకుపోయింది. ప్రతి సంవత్సరం తెలుగులో 10-15 మంది కొత్తవాళ్లు వస్తున్నారు. ఇంత పోటీ ఉన్నప్పుడు ఇలాంటి ఇంకో 2-3 సినిమాలు తీస్తే నిర్మాతలు కూడా రాజ్ తరుణ్ తో సినిమా చేసేందుకు ముందుకు రాకపోవచ్చు. ఏదేమైనా హీరోలు ఇండస్ట్రీలో కొనసాగాలంటే బడా నిర్మాతలను కాకుండా కథలను నమ్ముకుంటే మంచిది.

ఇలాంటి మరిన్ని పోస్టుల కోసం తెలుగు రష్ వెబ్సైటును ఫాలో అవ్వండి.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment