Cheri Yashodhaku pdf download – చేరి యశోదకు
చేరి యశోదకు శిశువితడు | ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు || సొలసి జూచినను సూర్య చంద్రులను లలివెదజల్లెడు లక్షణుడు | నిలిచిన నిలువున నిఖిల దేవతల కలిగించు సురల గనివో యితడు || మాటలాడిననను మరియజాండములు కోటులు వొడమెటి గుణరాశి | నీటుగ నూర్పుల నిఖిల వేదములు చాటువ నూరెటి సముద్రుడితడు || ముంగిట పొలసిన మోహన మాత్మల పొంగించే ఘన పురుషుడు | సంగతి మావంటి శరణాగతులకు అంగము శ్రీ వేంకటాధిపుడితడు ||