Mangalam Govindunaku pdf download – మంగళము గోవిందునకు

మంగళము గోవిందునకు జయ మంగళము గరుడ ధ్వజునకు మంగళము జయ మంగళము ధర్మ స్వరూపునకు | జయ జయ మంగళము || ఆదికిను ఆద్యైన దేవునకచ్యుతునకంభోజ నాభున- కాదికూర్మంబైన జగదాధార ముర్తికిని వేద రక్షకునకును సంతత వేదమార్గ విహారునకు బలి- భేదినికి సామాదిగాన ప్రియ విహారునకు || జయ జయ మంగళము || హరికి పరమేశ్వరునకు శ్రీధరునకు కాలాంతకునకును పరమ పురుషోత్తమునకు బహుబంధ దూరునకును సురముని స్తోత్రునకు దేవాసురగణ శ్రేష్టునకు కరుణా కరుణకును కాత్యాయినీ నుత కలిత … Read more

Muddugare pdf download – ముద్దుగారే

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు | తిద్దరాని మహిమల దేవకీ సుతుడు || అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము | పంతమాడే కంసుని పాలి వజ్రము | కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస | చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు || రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము | మితి గోవర్ధనపు గోమేధికము | సతమై శంఖు చక్రాల సందుల వైఢూర్యము | గతియై మంముగాచే(టి) కమలాక్షుడు || కాళింగుని తలలపై కప్పిన … Read more

Mangalam Jaya Mangalam pdf download – మంగళం జయ మంగళం

మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం || శిరమునందున మెరయుచుండెడి నెమలిపింఛకు మంగళం శ్యామలాంగుని కరములందలి మధుర మురళికి మంగళం || వనజదంమును ధిక్కరించెడి వదన శోభకు మంగళం కరుణ రసమును చిందుచుండెడి కన్నుదోయికి మంగళం || బ్రహ్మచే పూజింపబడిన చరణ యుగళికి మంగళం జగములన్నియు కన్నతండ్రగు చక్కనయ్యకు మంగళం || గోపికా గణ సేవితుడు శ్రీ గోవిందునకు మంగళం రాధికా పరివేష్టితుండౌ రసేశ్వరునకు మంగళం ||

Vinaro Bhagyamu pdf download – వినరో భాగ్యము విష్ణు కథ

వినరో భాగ్యము విష్ణు కథ | వెనుబలమిదివో విష్ణు కథ || ఆదినుండి సంధ్యాదివిధులలో వేదంబయినది విష్ణు కథ | నాదించీనిదె నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ || వదలక వేదవ్యాసులు నుడిగిన విదిత పావనము విష్ణు కథ | సదనంబయినది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ || గొల్లెతలు చల్లలు గొనకొని చిలకగ వెల్లివిరియాయె విష్ణు కథ | యిల్లిదే శ్రీ వేంకటేశ్వరు నామము వెల్లి గొలిపె నీ విష్ణు కథ ||

Ksheerabdhi Kanyakaku pdf download – క్షీరాబ్ధి కన్యకకు

క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని నీరజాలయకును నీరాజనం | జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం | అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువుమాణిక్యముల నీరాజనం || చరణ కిసలయములకు సకియరంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం | అరిది జఘనంబునకు అతివనిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం || పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై నెగడు సతికళలకును నీరాజనం | జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం ||

Muthyala Harathi Pagadala Harathi pdf download – ముత్యాల హారతీ పగడాల హారతీ

ముత్యాల హారతీ పగడాల హారతీ వాసవాంబ నీకిదే వైఢూర్య హారతీ || అష్టభుజముల పుష్కరిణియందున అష్టలక్ష్మీ నీకిదే పచ్చల హారతీ || ముత్యాల || వాణి గాయత్రీ సావిత్రి వాసవీ వరాలిచ్చే తల్లికి వజ్రాల హారతీ || ముత్యాల || కుసుమ కోమలీ అభయముద్రధారిణీ కోమలాంగి నీకిదే కెంపుల హారతీ || ముత్యాల || పద్మభూషణీ సత్ప్రభావతీ చెలువంత దేవికి పగడాల హారతీ || ముత్యాల || మోక్షకారిణీ ఆనందరూపిణీ మణిద్వీపవాసినికి కర్పూర హారతీ || ముత్యాల … Read more

Nanati Baduku Natakamu pdf download – నానాటి బదుకు నాటకము

నానాటి బదుకు నాటకము | కానక కన్నది కైవల్యము || పుట్టుటయు నిజము పోవుటయు నిజము | నట్టనడిమి పని నాటకము | యెట్టనెదుట గలదీ ప్రపంచము | కట్టగడపటిది కైవల్యము || కుడిచేదన్నము కోకచుట్టెడిది | నడమంత్రపు పని నాటకము | వొడిగట్టుకొనిన వుభయ కర్మములు | గడిదాటినపుడె కైవల్యము || తెగదు పాపము తీరదు పుణ్యము | నగి నగి కాలము నాటకము | యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక | గగనము మీదిది కైవల్యము … Read more

Duduku gala nanne pdf download – దుడుకు గల నన్నే

దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో || కడు దుర్విషయా కృష్టుడై గడియ గడియకు నిండారు దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా || శ్రీ వనితా హృత్కుముదాబ్జా వాఙ్మానస గోచర దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా || సకల భూతముల యందు నీవై యుండగ మదిలేక పోయిన దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా || చిరుత ప్రాయమున నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన దుడుకు గల … Read more

Jaya Jagadeesa Hare pdf download – జయ జగదీశ హరే (హారతి పాట)

ఓం జయ జగదీశ హరే స్వామి జయ జగదీశ హరే భక్త జనోఁ కే సంకట దాస జనోఁ కే సంకట క్షణ మే దూర్ కరే ఓం జయ జగదీశ హరే || జో ధ్యావే ఫల్ పావే దుఖ్ బినసే మన్ కా స్వామి దుఖ్ బినసే మన్ కా సుఖ సంపతి ఘర్ ఆవే సుఖ సంపతి ఘర్ ఆవే కష్ట మిటే తన్ కా ఓం జయ జగదీశ హరే || … Read more

Jagadananda karaka pdf download – జగదానంద కారకా

గగనాధిప సత్కులజ రాజరాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్య దాయక సదా సకల జగదానంద కారకా | అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణా నగధర సురభూజ దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో బృంద గోవింద సానంద మా వరాజరాప్త శుభకరానేక జగదానంద కారకా | నిగమ నీరజామృతజ పోషకా నిమిశవైరి వారిద సమీరణ ఖగ తురంగ సత్కవి హృదాలయా గణిత వానరాధిప నతాంఘ్రియుగ జగదానంద కారకా || ఇంద్ర నీలమణి … Read more