Sri Venkateshwara Panchaka Stotram pdf download – శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రం

శ్రీధరాధినాయకం శ్రితాపవర్గదాయకం
శ్రీగిరీశమిత్రమంబుజేక్షణం విచక్షణం |
శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరం || 1 ||
ఉపేంద్రమిందుశేఖరారవిందజామరేంద్రబృ-
-న్దారకాదిసేవ్యమానపాదపంకజద్వయం |
చంద్రసూర్యలోచనం మహేంద్రనీలసన్నిభం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరం || 2 ||
నందగోపనందనం సనందనాదివందితం
కుందకుట్మలాగ్రదంతమిందిరామనోహరం |
నందకారవిందశంఖచక్రశార్ఙ్గసాధనం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరం || 3 ||
నాగరాజపాలనం భోగినాథశాయినం
నాగవైరిగామినం నగారిశత్రుసూదనం |
నాగభూషణార్చితం సుదర్శనాద్యుదాయుధం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరం || 4 ||
తారహీరశారదాభ్రతారకేశకీర్తి సం-
-విహారహారమాదిమధ్యాంతశూన్యమవ్యయం |
తారకాసురాటవీకుఠారమద్వితీయకం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరం || 5 ||
ఇతి శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment