Adivo Alladivo pdf download – అదివో అల్లదివో

✅ Fact Checked

అదివో అల్లదివో శ్రీ హరివాసము
పదివేల శేషుల పడగలమయము || అదివో ||
అదే వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్య నివాస మఖిల మునులకు
అదే చూడుడు అదే ంరొక్కుడు ఆనందమయము || అదివో ||
చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము || అదివో ||
కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీవేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపదరూప మదివో
పావనముల కెల్ల పావనమయము || అదివో ||


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment