వాతాపి గణపతిం భజేఽహం
వారణాశ్యం వరప్రదం శ్రీ |
భూతాది సంసేవిత చరణం
భూత భౌతిక ప్రపంచ భరణం |
వీతరాగిణం వినుత యోగినం
విశ్వకారణం విఘ్నవారణం |
పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రికోణ మధ్యగతం
మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్రస్థితం
పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం
నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవామకర విద్రుతేక్షుఖండం |
కరాంబుజ పాశ బీజాపూరం
కలుషవిదూరం భూతాకారం
హరాది గురుగుహ తోషిత బింబం
హంసధ్వని భూషిత హేరంబం |
Vatapi Ganapathim Bhajeham pdf download – వాతాపి గణపతిం భజేహం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



