Sri Tripura Sundari Stotram 2 pdf download – శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం 2

శ్వేతపద్మాసనారూఢాం శుద్ధస్ఫటికసన్నిభాం |
వందే వాగ్దేవతాం ధ్యాత్వా దేవీం త్రిపురసుందరీం || 1 ||
శైలాధిరాజతనయాం శంకరప్రియవల్లభాం |
తరుణేందునిభాం వందే దేవీం త్రిపురసుందరీం || 2 ||
సర్వభూతమనోరంయాం సర్వభూతేషు సంస్థితాం |
సర్వసంపత్కరీం వందే దేవీం త్రిపురసుందరీం || 3 ||
పద్మాలయాం పద్మహస్తాం పద్మసంభవసేవితాం |
పద్మరాగనిభాం వందే దేవీం త్రిపురసుందరీం || 4 ||
పంచబాణధనుర్బాణపాశాంకుశధరాం శుభాం |
పంచబ్రహ్మమయీం వందే దేవీం త్రిపురసుందరీం || 5 ||
షట్పుండరీకనిలయాం షడాననసుతామిమాం |
షట్కోణాంతఃస్థితాం వందే దేవీం త్రిపురసుందరీం || 6 ||
హరార్ధభాగనిలయామంబామద్రిసుతాం మృడాం |
హరిప్రియానుజాం వందే దేవీం త్రిపురసుందరీం || 7 ||
అష్టైశ్వర్యప్రదామంబామష్టదిక్పాలసేవితాం |
అష్టమూర్తిమయీం వందే దేవీం త్రిపురసుందరీం || 8 ||
నవమాణిక్యమకుటాం నవనాథసుపూజితాం |
నవయౌవనశోభాఢ్యాం వందే త్రిపురసుందరీం || 9 ||
కాంచీవాసమనోరంయాం కాంచీదామవిభూషితాం |
కాంచీపురీశ్వరీం వందే దేవీం త్రిపురసుందరీం || 10 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment