Sri Karthikeya Karavalamba Stotram pdf download – శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రం

ఓం‍కారరూప శరణాశ్రయ శర్వసూనో
సింగార వేల సకలేశ్వర దీనబంధో |
సంతాపనాశన సనాతన శక్తిహస్త
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబం || 1
పంచాద్రివాస సహజా సురసైన్యనాథ
పంచామృతప్రియ గుహ సకలాధివాస |
గంగేందు మౌళి తనయ మయిల్వాహనస్థ
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబం || 2
ఆపద్వినాశక కుమారక చారుమూర్తే
తాపత్రయాంతక దాయాపర తారకారే |
ఆర్తాఽభయప్రద గుణత్రయ భవ్యరాశే
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబం || 3
వల్లీపతే సుకృతదాయక పుణ్యమూర్తే
స్వర్లోకనాథ పరిసేవిత శంభు సూనో |
త్రైలోక్యనాయక షడానన భూతపాద
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబం || 4
జ్ఞానస్వరూప సకలాత్మక వేదవేద్య
జ్ఞానప్రియాఽఖిలదురంత మహావనఘ్నే |
దీనవనప్రియ నిరమయ దానసింధో
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబం || 5
ఇతి శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment