గౌరీశివవాయువరాయ అంజనికేసరిసుతాయ చ |
అగ్నిపంచకజాతాయ ఆంజనేయాయ మంగళం || 1 ||
వైశాఖేమాసి కృష్ణాయాం దశంయాం మందవాసరే |
పూర్వాభాద్రప్రభూతాయ ఆంజనేయాయ మంగళం || 2 ||
పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ |
కౌండిన్యగోత్రజాతాయ ఆంజనేయాయ మంగళం || 3 ||
సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ |
ఉష్ట్రారూఢాయ వీరాయ ఆంజనేయాయ మంగళం || 4 ||
దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ |
తప్తకాంచనవర్ణాయ ఆంజనేయాయ మంగళం || 5 ||
కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ |
మాణిక్యహారకంఠాయ ఆంజనేయాయ మంగళం || 6 ||
భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే |
సృష్టికారణభూతాయ ఆంజనేయాయ మంగళం || 7 ||
రంభావనవిహారాయ గంధమాదనవాసినే |
సర్వలోకైకనాథాయ ఆంజనేయాయ మంగళం || 8 ||
Sri Anjaneya Mangala Ashtakam pdf download – శ్రీ ఆంజనేయ మంగళాష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



