Sri Shiva Panchakshara Stotram pdf download – శ్రీ శివ పంచాక్షర స్తోత్రం

✅ Fact Checked

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై నకారాయ నమః శివాయ || 1 ||
మందాకినీసలిలచందనచర్చితాయ
నందీశ్వరప్రమథనాథమహేశ్వరాయ |
మందారముఖ్యబహుపుష్పసుపూజితాయ
తస్మై మకారాయ నమః శివాయ || 2 ||
శివాయ గౌరీవదనాబ్జబృంద-
-సూర్యాయ దక్షాధ్వరనాశకాయ |
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ
తస్మై శికారాయ నమః శివాయ || 3 ||
వసిష్ఠకుంభోద్భవగౌతమార్య-
-మునీంద్రదేవార్చితశేఖరాయ |
చంద్రార్కవైశ్వానరలోచనాయ
తస్మై వకారాయ నమః శివాయ || 4 ||
యక్షస్వరూపాయ జటాధరాయ
పినాకహస్తాయ సనాతనాయ |
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై యకారాయ నమః శివాయ || 5 ||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శ్రీశివ పంచాక్షర స్తోత్రం సంపూర్ణం ||


Also Read  Sri Shiva Shodasopachara Puja pdf download – శ్రీ శివ షోడశోపచార పూజ
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment