రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం ||
కోసలేశాయ మందహాస దాసపోషణాయ
వాసవాది వినుత సద్వరద మంగళం || 1 ||
చారు కుంకుమో పేత చందనాది చర్చితాయ
హారకటక శోభితాయ భూరి మంగళం || 2 ||
లలిత రత్నకుండలాయ తులసీవనమాలికాయ
జలద సద్రుశ దేహాయ చారు మంగళం || 3 ||
దేవకీపుత్రాయ దేవ దేవోత్తమాయ
చాప జాత గురు వరాయ భవ్య మంగళం || 4 ||
పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ
అండజాతవాహనాయ అతుల మంగళం || 5 ||
విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ
సుజన చిత్త కామితాయ శుభగ మంగళం || 6 ||
రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం || 7 ||
Ramachandraya pdf download – రామచంద్రాయ
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



