పెద్ద హీరోలతో సినిమాలు తీయడం వర్మకు చేతకాదంట

రామ్ గోపాల్ వర్మకు తెలుగు దర్శకులలో ప్రత్యేక స్థానం ఉంది. ఎవరెలా అనుకున్నా తన మనసులో మాటల్ని సూటిగా చెప్తుంటారు. ఇప్పుడు అదే పద్దతి సినిమాల విషయంలో కూడా ఫాలో అవుతున్నారు. ఎలాంటి ప్రశ్నకైనా తనదైన శైలిలో సమాధానం చెప్పే వర్మకు బ్యూటిఫుల్ మూవీ ప్రొమోషన్స్ లో ఒక ప్రశ్న ఎదురైంది. మీడియా సమావేశంలో భాగంగా పెద్ద హీరోలతో సినిమా చేసే ఆలోచన లేదా అని అడిగితే, దానికి సమాధానంగా వాస్తవాలకు దగ్గరగా, విభిన్నమైన చిత్రాలు తీసే నాకు పెద్ద హీరోలతో సినిమాలు తీయడం చేత కాదు అన్నారు. పెద్ద హీరో సినిమా అంటే వాటి లెక్కలు వేరే ఉంటాయి, పైగా అభిమానుల కోసం మార్పులు చేర్పులు చెయ్యాల్సి వస్తుంది. అలా సినిమాలు తీయటం నాకు కుదరదు అని ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చారు.

పెద్ద హీరోలతో సినిమాలు తీయడం వర్మకు చేతకాదంట

ఈ మధ్యనే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సోషల్ సెటైర్ ఫిలిం తో పరాజయం పాలయ్యారు. కేవలం వివాదాలనే ప్రొమోషన్స్ కోసం వాడుకుంటూ వరుస సినిమాలతో ముందుకు వెళ్తున్నారు. పార్థ్, నైనా గంగూలీ ప్రధాన పాత్రలలో నటించిన బ్యూటిఫుల్ సినిమా వర్మ కెరీర్ ఆరంభ దశలో తీసిన రంగీలా సినిమాకి నివాళిగా తీస్తున్నారు. ప్రేక్షకులు మాత్రం అటుఇటుగా కథను మర్చి అదే సినిమా మళ్ళీ తీసారని విమర్శిస్తున్నారు. బ్యూటిఫుల్ జనవరి 1న విడుదల కానుంది. ఇవి కాకుండా వర్మ ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ అనే మరో ఇండో చైనీస్ ఫిల్మ్ కూడా తీస్తున్నారు.

Share on facebook
Share on twitter
Share on reddit
Share on linkedin
Share on pinterest
Share on whatsapp
Share on telegram
>