సల్మాన్ ఖాన్ క్షమాపణ చెప్పి బ్రతిమాలుకుంటే వదిలేస్తాడంట

వివాదాస్పద బాలీవుడ్ యాక్టర్ నిర్మాత మరియు క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ ఎప్పుడూ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. ప్రస్తుతం హీరో సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్స్ చేస్తున్నాడు. సల్మాన్ లేటెస్ట్ మూవీ దబాంగ్ 3 కి నెగటివ్ రివ్యూ ఇవ్వటమే కాకుండా తన రివ్యూలతో సల్మాన్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెడతానని చెప్తున్నాడు. వచ్చే మూడేళ్ళలో సల్మాన్ ని ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని శపధం చేస్తున్నాడు. ఆఖరికి ఈ ట్వీట్స్ వ్యవహారం సల్మాన్ వరకూ వెళ్ళటం తో అతను అధికారులకు కంప్లైంట్ ఇచ్చాడు. కానీ కమాల్ ఆర్ ఖాన్ ఇంకా టార్గెట్ చేస్తూనే ఉన్నాడు.

సల్మాన్ ఖాన్ క్షమాపణ చెప్పి బ్రతిమాలుకుంటే వదిలేస్తాడంట

కేవలం వివాదాలతోనే జీవనోపాధి వెతుక్కున్న అతి తక్కువ మందిలో కమాల్ ఆర్ ఖాన్ ఒకడు. తన మీద వచ్చిన కంప్లైంట్ కు స్పందిస్తూ, ఒక మూవీ బాగుందో లేదో చెప్పే హక్కు నాకుంది, అలాగే ఏ హీరో గురించైనా మాట్లాడే హక్కు నాకుంది. ఒక వేళ సల్మాన్ నా ట్వీట్స్ భరించలేకపోతే నాకు సారీ చెప్పి, రిక్వెస్ట్ చేస్తే వదిలేస్తా అని మరో వివాదాస్పద వ్యాఖ్య చేసాడు. ఇంతకుముందు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని బాలీవుడ్ కొంతకాలం అతన్ని వెలివేసింది. సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ దబాంగ్ 3 కి ఎన్ని నెగటివ్ రివ్యూస్ వచ్చినా వంద కోట్లకు పైగా వసూళ్లు దక్కాయి. కమాల్ ఆర్ ఖాన్ మాత్రం ఇలాంటి వ్యాఖ్యలతో సల్మాన్ అభిమానుల దృష్టిలో విలన్ లా తయారయ్యాడు. ఒక నటుడిగా, నిర్మాతగా సక్సెస్ కాలేని కమాల్ ఆర్ ఖాన్ తనకున్న కొద్దిపాటి గుర్తింపుని వాడుకుని కేవలం వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు.

Share on facebook
Share on twitter
Share on reddit
Share on linkedin
Share on pinterest
Share on whatsapp
Share on telegram
>