Sri Varahi Dwadasa Nama Stotram pdf download – శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం

శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం అంటే శ్రీ వారాహి దేవిని స్తుతిస్తూ పఠించే 12 నామాలు. ఈ నామాలను పఠించడం వలన వారాహి దేవి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

హయగ్రీవ ఉవాచ |

శృణు ద్వాదశనామాని తస్యా దేవ్యా ఘటోద్భవ |
యదాకర్ణనమాత్రేణ ప్రసన్నా సా భవిష్యతి || 1 ||

పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ |
తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా || 2 ||

వార్తాలీ చ మహాసేనాప్యాజ్ఞాచక్రేశ్వరీ తథా |
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే || 3 ||

నామద్వాదశకాభిఖ్య వజ్రపంజర మధ్యగః |
సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః || 4 ||

ఏతైర్నామభిరభ్రస్థాః సంకేతాం బహు తుష్టువుః |
తేషామనుగ్రహార్థాయ ప్రచచాల చ సా పునః || 5 ||

ఇతి శ్రీబ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానే సప్తదశోధ్యాయే శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment