Totakashtakam in telugu pdf download – తోటకాష్టకం

విదితాఖిలశాస్త్రసుధాజలధే
మహితోపనిషత్ కథితార్థనిధే |
హృదయే కలయే విమలం చరణం
భవ శంకర దేశిక మే శరణం || 1 ||
కరుణావరుణాలయ పాలయ మాం
భవసాగరదుఃఖవిదూనహృదం |
రచయాఖిలదర్శనతత్త్వవిదం
భవ శంకర దేశిక మే శరణం || 2 ||
భవతా జనతా సుహితా భవితా
నిజబోధవిచారణ చారుమతే |
కలయేశ్వరజీవవివేకవిదం
భవ శంకర దేశిక మే శరణం || 3 ||
భవ ఏవ భవానితి మే నితరాం
సమజాయత చేతసి కౌతుకితా |
మమ వారయ మోహమహాజలధిం
భవ శంకర దేశిక మే శరణం || 4 ||
సుకృతేఽధికృతే బహుధా భవతో
భవితా సమదర్శనలాలసతా |
అతిదీనమిమం పరిపాలయ మాం
భవ శంకర దేశిక మే శరణం || 5 ||
జగతీమవితుం కలితాకృతయో
విచరంతి మహామహసశ్ఛలతః |
అహిమాంశురివాత్ర విభాసి గురో
భవ శంకర దేశిక మే శరణం || 6 ||
గురుపుంగవ పుంగవకేతన తే
సమతామయతాం నహి కోఽపి సుధీః |
శరణాగతవత్సల తత్త్వనిధే
భవ శంకర దేశిక మే శరణం || 7 ||
విదితా న మయా విశదైకకలా
న చ కించన కాంచనమస్తి గురో |
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం
భవ శంకర దేశిక మే శరణం || 8 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment