షట్కోణాంతరమధ్యపద్మనిలయం తత్సంధిదిష్ఠాననం
చక్రాద్యాయుధచారుభూషణభుజం సజ్వాలకేశోదయం |
వస్త్రాలేపనమాల్యవిగ్రహతనుం తం ఫాలనేత్రం గుణైః
ప్రత్యాలీఢపదాంబుజం త్రినయనం చక్రాధిరాజం భజే || 1 ||
శంఖం శార్ఙ్గం సఖేటం హలపరశు గదా కుంత పాశాన్ దధానం
అన్యైర్వామైశ్చ చక్రేష్వసి ముసలలసద్వజ్రశూలాం కుశాగ్నీన్ |
జ్వాలాకేశం త్రినేత్రం జ్వలదనలనిభం హారకేయూరభూషం
ధ్యాయే షట్కోణ సంస్థం సకల రిపుజన ప్రాణసంహార చక్రం || 2 ||
వ్యాప్తి వ్యాప్తాంతరిక్షం క్షరదరుణ నిభా వాసితా శాంతరాళం
దంష్ట్రా నిష్ఠ్యూత వహ్ని ప్రవిరళ శబలాదభ్రశుభ్రాట్టహాసం |
శంఖారి శ్రీ గదాంభోరుహ ముసల ధనుః పాశ దీప్తాంకుశాడ్యైః
దోర్భిః పింగాక్షవేషం ప్రణమత శిరసా విష్ణు చక్రాభిదానం || 3 ||
ధ్యాయే చతుర్భుజం దేవం శఙ్ఖ చక్ర వరాభయం |
ధ్యాయే సుదర్శనం వీరం సర్వకార్యార్థ సిద్ధయే || 4 ||
సుదర్శన నమస్తేఽస్తు నమస్తే శత్రుసంహర |
అర్చయాంయుపచారేణ విష్ణురూపాయ తే నమః || 5 ||
చక్రద్వయం చాంకుశపాశయుక్తం
చతుర్భుజం భీకర సింహవక్త్రం |
నేత్రత్రయాలంకృత నిర్మలాంగం
నమామి సౌదర్శన నారసింహం || 6 ||
శఙ్ఖ చక్ర ధరం దేవం జ్వాలాచక్రమయం హరిం |
రోగఘ్నం పరమానందం చింతితార్థ ప్రదాయకం || 7 ||
హృత్పంకజే సమాసీనం జ్వాలామయ సుదర్శనం |
శంఖ చక్రాంబుజ గదా భూషితం రోహనాశనం || 8 ||
ధ్యాయేత్సౌదర్శనం దేవం ఆత్మరక్షాకరం ప్రభుం |
జ్వాలామాలా పరీతం చ ధ్యాయే హృదయపఙ్కజే || 9 ||
ధ్యాయే సుదర్శనం దేవం ఖేదనం పరవిద్యయోః |
సూర్యకోటిప్రతీకాశం ధ్యాయే హృదయ పంకజే || 10 ||
శంఖ చక్ర ధరం దేవం కోటిసూర్య సమప్రభం |
శత్రూణాం మారణార్థం చ అస్త్రచక్రం నమాంయహం || 11 ||
పాశాంకుశధరం దేవం పరిపూర్ణ కృపాకరం |
వశీకరణబాణాయ సంయక్సౌదర్శనాయ చ || 12 ||
రక్తవస్త్రధరం దేవం రక్తమాల్యానులేపనం |
వందేఽహం వశ్య బాణాయ చక్రరాజాయ తే నమః || 13 ||
పాశాంకుశం శక్తి శూలం చతుర్బాహుం త్రిలోచనం |
సంమోహనకరం వీరం ధ్యాయే సౌదర్శనేశ్వరం || 14 ||
సంమోహనాస్త్రరాజాయ నమః సౌదర్శనాయ చ |
మోహనార్థం భజాంయాశు సంమోహయ జగత్రయం || 15 ||
జ్వాలామాలానిభం దేవం సహస్రకరసంయుతం |
శత్రు మారణ కార్యేషు భజే హృచ్చక్రనాయకం || 16 ||
ఆకర్షణకరం దేవం పాశాంకుశధరం హరిం |
సంమోహాకర్షణాస్త్రం చ ధృత నారాయణం ప్రభుం || 17 ||
చక్రరాజ నమస్తేస్తు సర్వాకర్షణ సాయక |
ఆకర్షయ జగన్నాథ శరణం త్వాం గతోస్ంయహం || 18 ||
చక్రాద్యాయుధ చారు షోడశభుజం స జ్వాల కేశోజ్జ్వలం
చక్రం శంఖ గదాబ్జ శూల శరధీంశ్చాపం చ పాశాంకుశౌ |
కున్తం చర్మహలం భుశుణ్డి పరశూ వజ్రం తథా తర్జనీం
హేతిం షోడశధారిణం రిపుహరం శ్రీచక్రరాజం భజే || 19 ||
సింహాసన సమాసీనం దేవం చక్రం సురేశ్వరం
శ్రోతుం చక్రేశ కవచమబ్రువన్ సురసత్తమాః |
దేవ దేవ సహస్రాక్ష దైత్యాంతక శచీపతే
త్వయా సౌదర్శినీం రక్షాం శ్రోతుమిచ్ఛామహే వయం || 20 ||
Sri Sudarshana Vimsathi pdf download – శ్రీ సుదర్శన వింశతి