కల్పానోకహపుష్పజాలవిలసన్నీలాలకాం మాతృకాం
కాంతాం కంజదళేక్షణాం కలిమలప్రధ్వంసినీం కాళికాం |
కాంచీనూపురహారదామసుభగాం కాంచీపురీనాయికాం
కామాక్షీం కరికుంభసన్నిభకుచాం వందే మహేశప్రియాం || 1 ||
కాశాభాం శుకభాసురాం ప్రవిలసత్కోశాతకీ సన్నిభాం
చంద్రార్కానలలోచనాం సురుచిరాలంకారభూషోజ్జ్వలాం |
బ్రహ్మశ్రీపతివాసవాదిమునిభిః సంసేవితాంఘ్రిద్వయాం
కామాక్షీం గజరాజమందగమనాం వందే మహేశప్రియాం || 2 ||
ఐం క్లీం సౌరితి యాం వదంతి మునయస్తత్త్వార్థరూపాం పరాం
వాచామాదిమకారణం హృది సదా ధ్యాయంతి యాం యోగినః |
బాలాం ఫాలవిలోచనాం నవజపావర్ణాం సుషుంనాశ్రితాం
కామాక్షీం కలితావతంససుభగాం వందే మహేశప్రియాం || 3 ||
యత్పాదాంబుజరేణులేశమనిశం లబ్ధ్వా విధత్తే విధి-
-ర్విశ్వం తత్పరిపాతి విష్ణురఖిలం యస్యాః ప్రసాదాచ్చిరం |
రుద్రః సంహరతి క్షణాత్తదఖిలం యన్మాయయా మోహితః
కామాక్షీమతిచిత్రచారుచరితాం వందే మహేశప్రియాం || 4 ||
సూక్ష్మాత్సూక్ష్మతరాం సులక్షితతనుం క్షాంతాక్షరైర్లక్షితాం
వీక్షాశిక్షితరాక్షసాం త్రిభువనక్షేమంకరీమక్షయాం |
సాక్షాల్లక్షణలక్షితాక్షరమయీం దాక్షాయణీం సాక్షిణీం
కామాక్షీం శుభలక్షణైః సులలితాం వందే మహేశప్రియాం || 5 ||
ఓంకారాంగణదీపికాముపనిషత్ప్రాసాదపారావతీం
ఆంనాయాంబుధిచంద్రికామఘతమఃప్రధ్వంసహంసప్రభాం |
కాంచీపట్టణపంజరాంతరశుకీం కారుణ్యకల్లోలినీం
కామాక్షీం శివకామరాజమహిషీం వందే మహేశప్రియాం || 6 ||
హ్రీంకారాత్మకవర్ణమాత్రపఠనాదైంద్రీం శ్రియం తన్వతీం
చిన్మాత్రాం భువనేశ్వరీమనుదినం భిక్షాప్రదానక్షమాం |
విశ్వాఘౌఘనివారిణీం విమలినీం విశ్వంభరాం మాతృకాం
కామాక్షీం పరిపూర్ణచంద్రవదనాం వందే మహేశప్రియాం || 7 ||
వాగ్దేవీతి చ యాం వదంతి మునయః క్షీరాబ్ధికన్యేతి చ
క్షోణీభృత్తనయేతి చ శ్రుతిగిరో యాం ఆమనంతి స్ఫుటం |
ఏకానేకఫలప్రదాం బహువిధాఽఽకారాస్తనూస్తన్వతీం
కామాక్షీం సకలార్తిభంజనపరాం వందే మహేశప్రియాం || 8 ||
మాయామాదిమకారణం త్రిజగతామారాధితాంఘ్రిద్వయాం
ఆనందామృతవారిరాశినిలయాం విద్యాం విపశ్చిద్ధియాం |
మాయామానుషరూపిణీం మణిలసన్మధ్యాం మహామాతృకాం
కామాక్షీం కరిరాజమందగమనాం వందే మహేశప్రియాం || 9 ||
కాంతా కామదుఘా కరీంద్రగమనా కామారివామాంకగా
కల్యాణీ కలితావతారసుభగా కస్తూరికాచర్చితా
కంపాతీరరసాలమూలనిలయా కారుణ్యకల్లోలినీ
కల్యాణాని కరోతు మే భగవతీ కాంచీపురీదేవతా || 10 ||
Sri Kamakshi stotram pdf download – శ్రీ కామాక్షీ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



