ఇంద్ర ఉవాచ |
భజేఽహం సదా రామమిందీవరాభం
భవారణ్యదావానలాభాభిధానం |
భవానీహృదా భావితానందరూపం
భవాభావహేతుం భవాదిప్రపన్నం || 1 ||
సురానీకదుఃఖౌఘనాశైకహేతుం
నరాకారదేహం నిరాకారమీడ్యం |
పరేశం పరానందరూపం వరేణ్యం
హరిం రామమీశం భజే భారనాశం || 2 ||
ప్రపన్నాఖిలానందదోహం ప్రపన్నం
ప్రపన్నార్తినిఃశేషనాశాభిధానం |
తపోయోగయోగీశభావాభిభావ్యం
కపీశాదిమిత్రం భజే రామమిత్రం || 3 ||
సదా భోగభాజాం సుదూరే విభాంతం
సదా యోగభాజామదూరే విభాంతం |
చిదానందకందం సదా రాఘవేశం
విదేహాత్మజానందరూపం ప్రపద్యే || 4 ||
మహాయోగమాయావిశేషానుయుక్తో
విభాసీశ లీలానరాకారవృత్తిః |
త్వదానందలీలాకథాపూర్ణకర్ణాః
సదానందరూపా భవంతీహ లోకే || 5 ||
అహం మానపానాభిమత్తప్రమత్తో
న వేదాఖిలేశాభిమానాభిమానః |
ఇదానీం భవత్పాదపద్మప్రసాదా-
-త్త్రిలోకాధిపత్యాభిమానో వినష్టః || 6 ||
స్ఫురద్రత్నకేయూరహారాభిరామం
ధరాభారభూతాసురానీకదావం |
శరచ్చంద్రవక్త్రం లసత్పద్మనేత్రం
దురావారపారం భజే రాఘవేశం || 7 ||
సురాధీశనీలాభ్రనీలాంగకాంతిం
విరాధాదిరక్షోవధాల్లోకశాంతిం |
కిరీటాదిశోభం పురారాతిలాభం
భజే రామచంద్రం రఘూణామధీశం || 8 ||
లసచ్చంద్రకోటిప్రకాశాదిపీఠే
సమాసీనమంకే సమాధాయ సీతాం |
స్ఫురద్ధేమవర్ణాం తడిత్పుంజభాసాం
భజే రామచంద్రం నివృత్తార్తితంద్రం || 9 ||
ఇతి శ్రీమదధ్యాత్మరామాయణే యుద్ధకాండే త్రయోదశః సర్గే ఇంద్ర కృత శ్రీ రామ స్తోత్రం |
Indra Kruta Sri Rama Stotram pdf download – శ్రీ రామ స్తోత్రం (ఇంద్ర కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



