Sri Subrahmanya Gadyam pdf download – శ్రీ సుబ్రహ్మణ్య గద్యం

పురహరనందన, రిపుకులభంజన, దినకరకోటిరూప, పరిహృతలోకతాప, శిఖీంద్రవాహన, మహేంద్రపాలన, విధృతసకలభువనమూల, విధుతనిఖిలదనుజతూల, తాపససమారాధిత, పాపజవికారాజిత, తారుణ్యవిజితమారాకార, కారుణ్యసలిలపూరాధార, మయూరవరవాహన, మహేంద్రగిరికేతన, భక్తిపరగంయ, శక్తికరరంయ, పరిపాలితనాక, పురశాసనపాక, నిఖిలలోకనాయక, గిరివిదారిసాయక, మహాదేవభాగధేయ, మహాపుణ్యనామధేయ, వినతశోకవారణ, వివిధలోకకారణ, సురవైరికాల, పురవైరిబాల, భవబంధవిమోచన, దళదంబువిలోచన, కరుణామృతరససాగర, తరుణామృతకరశేఖర, వల్లీమానహారివేష, మల్లీమాలభారికేశ, పరిపాలితవిబుధలోక, పరికాలితవినతశోక, ముఖవిజితచంద్ర, నిఖిలగుణమందిర, భానుకోటిసదృశరూప, భానుకోపభయదచాప, పితృమనోహారిమందహాస, రిపుశిరోదారిచంద్రహాస, శ్రుతికలితమణికుండల, రుచివిజితరవిమండల, భుజవరవిజితసాల, భజనపరమనుజపాల, నవవీరసంసేవిత, రణధీరసంభావిత, మనోహారిశీల, మహేంద్రారికీల, కుసుమవిశదహాస, కులశిఖరినివాస, విజితకరణమునిసేవిత, విగతమరణజనిభాషిత, స్కందపురనివాస, నందనకృతవిలాస, కమలాసనవినత, చతురాగమవినుత, కలిమలవిహీనకృతసేవన, సరసిజనికాశశుభలోచన, అహార్యవరధీర, అనార్యనరదూర, విదళితరోగజాల, విరచితభోగమూల, భోగీంద్రభాసిత, యోగీంద్రభావిత, పాకశాసనపరిపూజిత, నాకవాసినికరసేవిత, విద్రుతవిద్యాధర, విద్రుమహృద్యాధర, దలితదనుజవేతండ, విబుధవరదకోదండ, పరిపాలితభూసుర, మణిభూషణభాసుర, అతిరంయస్వభావ, శ్రుతిగంయప్రభావ, లీలావిశేషతోషిత శంకర, హేలావిశేషకలితసంగర, సుమసమరదన, శశధరవదన, సుబ్రహ్మణ్య విజయీ భవ, విజయీ భవ |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment