చిన్న సినిమాల వెంటపడుతున్న పెద్ద నిర్మాతలు

చిత్ర పరిశ్రమలో ఒక్కో జనరేషన్ లో ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. నాలుగైదేళ్ల క్రితం వరకు నిర్మాత ఎవరో తెలిస్తే సినిమా బడ్జెట్ ఎంతుంటుందో తేలిగ్గా అంచనా వేయగలిగేవాళ్ళం. కానీ, ఇప్పుడు నెమ్మదిగా ట్రెండ్ మారిపోతుంది. పెద్ద నిర్మాణ సంస్థలు కూడా, చిన్న చిత్రాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ మధ్య తక్కువ బడ్జెట్ తో వచ్చి భారీ లాభాల్ని తెస్తున్న చిత్రాల సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ఎప్పుడు పరిశ్రమలో ట్రెండ్స్ ని గమనిస్తూ ఉండే నిర్మాతలు, ఆలస్యం చేయకుండా చిన్న చిత్రాలలో పెట్టుబడులు పెడుతున్నారు. బాహుబలి తీసిన ఆర్కా మీడియా నుండి స్టార్ హీరోలతో సినిమాలు తీసే మైత్రి మూవీ మేకర్స్ వరకు అందరు లోబడ్జెట్ చిత్రాలలో పెట్టుబడుల వైపు మొగ్గు చూపిస్తున్నారు. సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేసిన ‘మత్తు వదలరా’ చిత్రం ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటుంది. చాలా తక్కువ బడ్జెట్ తో నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. నిర్మాతలు రవిశంకర్, చెర్రి (చిరంజీవి)లు పాత్రికేయులతో ముచ్చటించారు.

చిన్న సినిమాల వెంటపడుతున్న పెద్ద నిర్మాతలు

కేవలం కథను మాత్రమే నమ్మి సినిమా తీశామని, చిత్ర విజయం మాత్రం దర్శకుడు, మిగిలిన చిత్ర బృందం వల్లే వచ్చిందని చెప్పారు. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తి తో మరిన్ని చిన్న సినిమాలని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొత్త కథలు వింటున్నారు, నవతరం ఇండస్ట్రీకి వస్తే ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించవచ్చని ఆశాభావం వ్యక్తం చేసారు. మత్తు వదలరా చిత్రాన్ని రవిశంకర్, చెర్రి (చిరంజీవి)లతో పాటు, మైత్రీ మూవీ మేకర్స్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం 2020లో పదుల సంఖ్యలో చిన్న సినిమాలు వచ్చే అవకాశం ఉంది. పెద్ద నిర్మాతలు ఆశక్తి చూపడంతో మంచి సాంకేతిక విలువలు, భారీ విడుదలకు అవకాశం దొరుకుతుంది.

Share on facebook
Share on twitter
Share on reddit
Share on linkedin
Share on pinterest
Share on whatsapp
Share on telegram
>