మరో కథ సిద్ధం చేసే పనిలో టాక్సీవాలా డైరెక్టర్

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా యువ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన `టాక్సీవాలా` చాలా సమస్యల తర్వాత విడుదలై మంచి విజయం సాధించింది. గీత గోవిందం తో పాటు టాక్సీవాలా కూడా లీక్ అయిందంటూ నిర్మాతలు చాలా కంగారుపడ్డారు. అన్ని ఒడిదుడుకులను అధిగమించి రెండు చిత్రాలు భారీ లాభాల్ని తెచ్చిపెట్టాయి. జీఏ2 పిక్చర్స్ యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎడిటింగ్ రూమ్ నుండి సినిమా లీక్ అయిందన్న వార్తలు రావడంతో మెగా నిర్మాత అల్లు అరవింద్ రంగంలోకి దిగి సినిమాని గట్టెక్కించారు. సినిమా ప్రమోషన్స్ కూడా వినూత్నంగా చేసి ప్రేక్షకులకి చేరువయ్యారు. అంతా బాగానే ఉంది కానీ, సినిమా రిలీజ్ అయ్యి ఏడాది గడుస్తున్నా, దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తర్వాత చేయబోయే సినిమా గురించి ఎలాంటి సమాచారం లేదు.

మరో కథ సిద్ధం చేసే పనిలో టాక్సీవాలా డైరెక్టర్

టాక్సీవాలా సక్సెస్ సాధించినా, రాహుల్ కి వేరే నిర్మాతల నుండి ఆఫర్స్ రాకపోవడం తో ఎస్ కె ఎన్ రెండో సినిమాకు కూడా కథ రెడీ చేయమన్నాడు. ప్రస్తుత కథనాల ప్రకారం ఈ సినిమాని కూడా జీఏ2 పిక్చర్స్ యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాహుల్ ఇప్పటికే కథను కూడా లాక్ చేసాడని, స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడని సమాచారం. ఈసారి ఎలాంటి కథతో రాబోతున్నాడు, ఎవరితో తీస్తాడో చూడాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి. కొత్త ఏడాదిలో చిత్ర నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Share on facebook
Share on twitter
Share on reddit
Share on linkedin
Share on pinterest
Share on whatsapp
Share on telegram
>