గోల్డెన్ టెంపుల్ సందర్శించిన స్టార్ హీరోయిన్

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజిలో ఉంది. వరుసగా తెలుగు, తమిళ్ మరియు హిందీలో ఆఫర్స్ వస్తున్నాయి. కానీ, అనుకున్న స్థాయిలో విజయం దక్కట్లేదు. తెలుగులో ఆమె నటించిన మన్మధుడు 2 నష్టాలు మిగల్చగా, హిందీలో అజయ్ దేవగణ్ తో చేసిన దే దే ప్యార్ దే మూవీ పర్వాలేదనిపించుకుంది. తమిళంలో చేసిన దేవ్, ఎన్ జి కె రెండు విడుదలైన మొదటిరోజే ప్లాప్ గా నిలిచాయి. తాజాగా హిందీలో ఆమె నటించిన మార్జావన్ ప్లాప్ తో పాటు విమర్శలు మూటకట్టుకుంది. ఎప్పుడో 80వ దశకంలో తీయాల్సిన సినిమా ఇప్పుడు తీశారంటూ క్రిటిక్స్ విమర్శించారు. ఎన్ని ప్లాప్స్ వచ్చినా రకుల్ కు హిందీ తమిళ్ లో ఆఫర్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. తెలుగులో స్టార్ హీరోలు ఎవరూ రకుల్ వైపు చూడట్లేదు. ప్రస్తుతం ఆమె కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న భారతీయుడు 2, శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం తో పాటు రెండు బాలీవుడ్ చిత్రాలలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. 2020లో ఫుల్ బిజీగా ఉండబోతుంది.

గోల్డెన్ టెంపుల్ సందర్శించిన స్టార్ హీరోయిన్

ఇక 2020లో తన కెరీర్ బాగుండాలని రకుల్ తల్లిదండ్రులతో కలిసి అమృత్ సర్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ సందర్శించారు. స్వతహాగా పంజాబీ కుటుంబానికి చెందిన రకుల్ బాలీవుడ్ లో స్థిరపడాలని ఎప్పటినుండో ప్రయత్నిస్తుంది. ఆఫర్స్ వస్తున్నా కూడా స్టార్ హీరోల సినిమాలలో మాత్రం కనిపించే అవకాశం దక్కట్లేదు. తెలుగులో అప్పుడే రష్మిక, పూజ హెగ్డే లాంటివాళ్లు రకుల్ ను రీప్లేస్ చేస్తున్నారు. హిందీలో ఇప్పుడిప్పుడే అన్ని భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ఇదే సరైన సమయంగా భావిస్తున్న రకుల్ బాలీవుడ్ లో స్థిరపడడానికి ప్రయాత్నాలు ముమ్మరం చేసింది.

Share on facebook
Share on twitter
Share on reddit
Share on linkedin
Share on pinterest
Share on whatsapp
Share on telegram
>