అభిమానుల కోసం మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రయత్నం

తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే అభిమానుల్లో ప్రత్యేక స్థానం ఉంది. తొలి తెలుగు స్టార్ హీరోలైన ఎన్టీఆర్, నాగేశ్వర రావు లకు ఎంతమంది అభిమానులున్నా అభిమాన సంఘాలు, గుర్తింపు కార్డులు, హీరోల పేరుతో సేవా కార్యక్రమాలు, జన్మదిన వేడుకలు లాంటివన్నీ చిరంజీవితోనే ప్రారంభమయ్యాయి. చిరు సినిమా వస్తోందంటే ఫ్యాన్స్ చేసే హంగామా మిగిలిన ఇండస్ట్రీలలోని నటులను సైతం అసూయపడేలా చేస్తాయి. ఇంటర్నెట్ యుగం ప్రారంభం కాకముందు లెటర్స్ మరియు సినిమా పత్రికల చొరవతో అభిమానులతో టచ్ లో ఉండటానికి ప్రయత్నించేవారు. చిరంజీవికి దాదాపుగా ప్రతి జిల్లాలో అభిమాన సంఘాలున్నాయి. వాళ్ళతో తరచుగా కాంటాక్ట్ లో ఉంటూ సినిమాలపై అభిప్రాయాలు నేరుగా తెలుసుకునేవారు. ఆయన ఎదుగుదలలో వారి అండదండలు ఎప్పుడూ ఉన్నాయి. అంతగా తన వెన్నంటి ఉన్న అభిమానుల కోసమా మెగాస్టార్ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలుస్తుంది.

అభిమానుల కోసం మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రయత్నం

పరిశ్రమలో ఆయనకు సుస్థిర స్థానం ఇచ్చిన అభిమానులకు ఇన్సూరెన్స్ చేయించబోతున్నారంట. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్ – ఐ బ్యాంక్ లని స్థాపించి చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మెగాస్టార్ ఇప్పటికీ అభిమానుల మీద ప్రేమ చూపించటంలో తన స్థానం ఏంటో నిరూపించుకుంటున్నారు. ఇంతకుముందు చిరంజీవి చేసిన ఎన్నో సేవ కార్యక్రమాలు మిగిలిన హీరోలకు ఆదర్శంగా నిలిచాయి. ఇప్పుడు కూడా అందరు ఆయనను ఫాలో అవుతారేమో చూడాలి. ఇప్పటికే దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసారని తెలుస్తుంది. ప్రమాదవశాత్తు అభిమానుల్లో ఎవరైనా చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ పధకం ఉండబోతుంది. గత కొంతకాలంగా బ్యాంక్ – ఐ బ్యాంక్ కోసం శ్రమిస్తున్న అభిమానులతో ఈ పధకం ప్రారంభించబోతున్నారంట. ఇప్పటికే దీని గురించి ఇండస్ట్రీ అంతా చర్చించుకుంటున్నారు. ఈ పధకం ప్రారంభం అయిన తర్వాత దేశ వ్యాప్తంగా చర్చకు తెరతీస్తుందని మాట్లాడుకుంటున్నారు.

Share on facebook
Share on twitter
Share on reddit
Share on linkedin
Share on pinterest
Share on whatsapp
Share on telegram
>