వైల్డ్ డాగ్ గా కనిపించబోతున్న కింగ్ నాగార్జున

అక్కినేని నాగార్జున మన్మధుడు 2 సినిమా తర్వాత సైలెంట్ గా తన తర్వాత సినిమాను ప్రారంభించారు. సాలమన్ దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. మన్మధుడు ఎఫెక్ట్ తో పెద్దగా హడావిడి లేకుండా ప్రారంభించారు. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ తో సినిమా కాన్సెప్ట్ ని రివీల్ చేసారు. ఇందులో నాగార్జున ఒక NIA ఆఫీసర్ పాత్రలో ACP విజయ్ వర్మ ఉరఫ్ వైల్డ్ డాగ్ గా కనిపించబోతున్నారు. చాలా కాలం తర్వాత నాగార్జున ఇంత సీరియస్ పాత్రలో కనిపిస్తున్నారు. విజయ్ వర్మ ఒక డేర్ డెవిల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. నేరస్థులని నిర్ధాక్షిణ్యంగా చంపేస్తాడు కాబట్టి డిపార్ట్మెంట్ లో అతనికి వైల్డ్ డాగ్ అనే నిక్ నేమ్ ఉంటుంది.

వైల్డ్ డాగ్ గా కనిపించబోతున్న కింగ్ నాగార్జున

ఇది వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం ఇది బాట్ల హౌస్ ఎన్కౌంటర్ ఆధారంగా తెరకెక్కింది. 19 సెప్టెంబర్ 2008 లో జరిగిన ఈ ఎన్కౌంటర్ లో ఒక పోలీస్ ఆఫీసర్ ఇద్దరు తీవ్రవాదులు చనిపోయారు. ఆ తర్వాత దీన్ని ఫేక్ ఎన్కౌంటర్ అని నిరసనలు వెల్లువెత్తాయి. విచారణలో వాళ్ళు నిజంగా తీవ్రవాదులని తేలింది. వాస్తవ ఘటనల ఆధారంగా తీసినా, కథలో చాలా మార్పులు చేసి తీసారని తెలుస్తుంది. సినిమా ఫస్ట్ లుక్ లో టైటిల్ వైల్డ్ డాగ్ అని కథ అంతా ఎన్కౌంటర్ చుట్టూ తిరుగుతుందని స్పష్టం చేశారు.

Share on facebook
Share on twitter
Share on reddit
Share on linkedin
Share on pinterest
Share on whatsapp
Share on telegram
>